: బీజేపీతో పొత్తు వల్ల నష్టపోయా...వచ్చే ఎన్నికల్లో 3 లక్షల మెజార్టీతో గెలుస్తా: కేశినేని నాని


బీజేపీతో పొత్తు వల్ల విజయవాడలో తీవ్రంగా నష్టపోయానని టీడీపీ అర్బన్ కమిటీ ఎన్నికల సమావేశంలో ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీతో పొత్తు వల్ల విజయవాడ వెస్ట్ లో తనకు 50 వేల ఓట్లు రాలేదని అన్నారు. బీజేపీ క్రాస్ ఓటింగ్ కు పాల్పడిందని అన్నారు. లేకపోతే తనకు లక్షా 30 వేల మెజారిటీ రావాల్సిందని ఆయన చెప్పారు. తాను కేవలం 70 వేల ఓట్ల మెజారిటీతో గెలవడానికి కారణం బీజేపీయేనని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను 3 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తానని ఆయన తెలిపారు. ఈ మేరకు బుద్ధా వెంకన్న, బొండా ఉమ, గద్దె రామ్మోహన్ సహకారం అందిస్తున్నారని ఆయన తెలిపారు.  

  • Loading...

More Telugu News