: కారుకి అడ్డొచ్చాడని వైద్యుడ్ని కాల్చి చంపేశాడు!


చిన్న కారణానికి తీవ్రమైన ఆవేశానికి గురైన వ్యక్తి నడిరోడ్డుపై వైద్యుడ్ని కాల్చి చంపిన ఘటన హర్యాణాలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... హర్యాణాలోని గుర్గావ్ కి చెందిన మహావీర్ అనే వైద్యుడు బంధువుతో కలిసి బైక్‌ పై వెళ్తున్నాడు. వారి బైక్ ఫరూఖ్ నగర్ ప్రాంతంలో టర్న్ తీసుకుంటున్న క్రమంలో కారుని బైక్ రాసుకుంది. దీంతో మహావీర్ తో కారు డ్రైవర్ వాగ్వాదానికి దిగాడు.

దీంతో ఆవేశానికి గురైన డ్రైవర్ సోదరుడు రవి కారు లోంచి దిగి వచ్చి, తుపాకీతో వైద్యుడిపై నడిరోడ్డు మీద విచక్షణారహితంగా కాల్పులకు దిగాడు. దీంతో మహావీర్ అక్కడికక్కడే కుప్పకూలగా, డ్రైవర్ కు కూడా బుల్లెట్ దిగింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు, సంఘటనా స్థలికి చేరుకుని, డ్రైవర్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేశారు. కాల్పులు జరిపిన రవి పరారయ్యాడు.

  • Loading...

More Telugu News