: భారత్ దెబ్బకు న్యాయవాదిని మార్చేసిన పాక్.. ఖురేషీ స్థానంలో అష్తార్!
భారత్ దెబ్బకు పాకిస్థాన్ ఏకంగా తన న్యాయవాదిని మార్చేసింది. కుల్భూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో సరిగా వాదనలు వినిపించలేదన్న కారణంతో అతడిని తప్పించింది. జాదవ్ కేసులో బ్రిటన్కు చెందిన ఖవార్ ఖురేషీ ఇప్పటి వరకు పాక్ తరఫున వాదనలు వినిపించారు. అయితే ఈ కేసులో పాక్ తీరును తప్పుబట్టిన న్యాయస్థానం జాదవ్ ఉరిపై స్టే విధించింది. దీంతో అవమానంతో రగిలిపోతున్న పాక్ ఖురేషీని తప్పించి, ఆయన స్థానంలో ఆ దేశ అటార్నీ జనరల్ అష్తార్ అవౌసఫ్ను నియమించింది. ఈ మేరకు పాక్ విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. ఈ కేసుకు సంబంధించి పాక్ సైన్యం, ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ఐసీజే ఎదుట తమ వాదనలను బలంగా వినిపించడానికి కృషి చేస్తానని అష్తార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.