: జాదవ్ జీవించే ఉన్నారు.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు
వందకోట్ల పైచిలుకు భారతీయులు ఆనందించే వార్తను ప్రభుత్వ వర్గాలు అందించాయి. గూఢచర్యం ఆరోపణలతో పాకిస్థాన్ అరెస్ట్ చేసిన భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ బతికే ఉన్నారన్నది ఆ వార్త సారాంశం. పాక్ ఆర్మీ కోర్టు జాదవ్‌కు విధించిన ఉరిశిక్షపై అంతర్జాతీయ న్యాయస్థానం స్టే విధించింది. దీంతో భారతీయులు ఎంతో సంతోషించారు.
అయితే పాక్ ఇప్పటికే జాదవ్‌ను చంపేసి ఆ విషయంలో నాటకాలు ఆడుతోందని అనుమానించారు. ఈ విషయంలో పాక్ తీరుపై పను అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ జాదవ్ జీవించే ఉన్నారంటూ ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. దీంతో ప్రజల్లో ఏమూలో ఉన్న అనుమానాలు పటాపంచలు అయ్యాయి. ప్రభుత్వ ప్రకటనతో ఆయన కుటుంబ సభ్యులతోపాటు దేశమంతా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.