: చొరబాటుకు ప్రయత్నించిన ఉగ్రవాదులు... ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు, ఇద్దరు సైనికులు మృతి
జమ్ముకశ్మీర్‌లోని నౌగాం వద్ద కలకలం చెలరేగింది. ఈ రోజు సాయంత్రం ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు చొరబాటుకి ప్రయత్నించారు. దీనిని గమనించిన సైనికులు వెంటనే స్పందించి, కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు కూడా రెచ్చిపోయి కాల్పులు జరపడంతో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు ఉగ్రవాదులను సైనికులు హతమార్చారు. ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న జవాన్లు ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇంకా ఉగ్రవాదులు ఎవరయినా ఉన్నారా? అనే విషయంపై ఆపరేషన్ మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.