: బీజేపీతో పొత్తు అంశంపై స్పందించిన పన్నీర్ సెల్వం


త‌మిళ‌నాడులో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న స్థానిక సంస్థల ఎన్నికల నేప‌థ్యంలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వ‌ర్గం భార‌తీయ జ‌న‌తా పార్టీతో పొత్తు పెట్టుకుంటుందని అంద‌రూ భావించారు. అయితే, ఈ రోజు ప‌న్నీర్ సెల్వం మీడియాతో మాట్లాడుతూ... స్థానిక సంస్థల ఎన్నికల తేదీలను ప్రకటించిన తర్వాతే ఎవరితో పొత్తు పెట్టుకోవాలనేది నిర్ణయిస్తామని తేల్చిచెప్పారు. నిన్న‌టివ‌ర‌కు ఢిల్లీలో పర్యటించిన ప‌న్నీర్ సెల్వం ఎన్నికల సంఘాన్ని, ప్రధాన మంత్రి నరేంద్రమోదీని కలిశారు. రెండాకుల గుర్తును త‌మ‌కే కేటాయించాల‌ని ఎన్నిక‌ల సంఘాన్ని ఆయ‌న కోరారు. అదే సమయంలో మోదీతో కూడా ప‌న్నీర్ సెల్వం భేటీ కావ‌డంతో బీజేపీతో పొత్తు ఉంటుంద‌ని భావించిన వారు, ఆయన చేసిన తాజా ప్రకటనతో పొత్తు ఉంటుందా? ఉండ‌దా? అన్న సందిగ్ధంలో ప‌డ్డారు.          

  • Loading...

More Telugu News