: ‘హ్యాపీ బర్త్ డే నాన్నా’ అంటూ కల్యాణ్ రామ్ ట్వీట్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కల్యాణ్ రామ్ చేసిన ట్వీట్, పోస్ట్ చేసిన ఫొటో ఆసక్తికరంగా ఉన్నాయి. ‘హ్యాపీ బర్త్ డే నాన్నా’ అని ట్వీట్ తో పాటు, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు ఎంతో ఆప్యాయంగా ఉన్న ఓ ఫొటోను పోస్ట్ చేశాడు. కాగా, ప్రముఖ నటులు నాగార్జున, సాయిధరమ్ తేజ్, హీరోయిన్లు సమంత, కాజల్, మెహరీన్ తదితరులు తమ ట్వీట్ల ద్వారా జూనియర్ ఎన్టీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు.