: మేం తిరగబడితే టీఆర్ఎస్ నేతలు తిరగలేరు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
దౌర్జన్యాలు భరించే కాలం పోయిందని, తాము తిరగబడితే టీఆర్ఎస్ నేతలు తిరగలేరని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ మాటలకు, చేతలకు పొంతన లేదని, తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే గాదరి కిషోర్ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, చిన్న గొడవలను పెద్దగా చేసి కాంగ్రెస్ నేతలను వేధిస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. కాగా, నల్లగొండలో బత్తాయి మార్కెట్ యార్డు ప్రారంభోత్సవం రోజున జరిగిన సంఘటన నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ సంఘటనలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రైతులు గాయాలపాలయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి వెంకటరెడ్డిపై నల్లగొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం విదితమే.