: ఇలాగైతే ప్రపంచ పటంలో మన దేశం ఉండదు: పాక్ 'ఎంక్యూఎం' పార్టీ
తమ దేశ ప్రభుత్వ, ఆర్మీ తీరుపై పాకిస్థాన్ ప్రధాన ప్రతిపక్షం ముత్తహిదా క్వామీ మూవ్‌మెంట్(ఎంక్యూఎం) ఆందోళన వ్యక్తం చేసింది. తమ దేశంలోని సైన్యం, దాని అడుగుజాడల్లో నడిచే ఐఎస్‌ఐలే తమ దేశానికి ప్రధాన శత్రువులని వ్యాఖ్యానించింది. సైన్యం తమ దేశంలోని బలూచ్, మొహజిర్ల హక్కులను కాలరాస్తోందని తెలిపింది. సైన్యం అకృత్యాలు ఇలాగే కొనసాగితే ప్రపంచపటం నుంచి తమ దేశం కనుమరుగవుతుందని చెప్పింది. తమ దేశంలోని సింథి, పక్తూన్, పంజాబ్ భూస్వాములు కూడా తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాక్ సైన్యం చెప్పినట్లు వింటున్నారని తెలిపింది. కరాచీ, బలూచిస్తాన్‌లలో ఆర్మీ అటువంటి దారుణాలను ఆపేయాలని, అక్కడి నాయకులతో చర్చలు జరపాలని కోరింది. అలా చేయకుండా సైనిక చర్యలు ఇలాగే కొనసాగిస్తే మాత్రం ప్రమాదం తప్పదని హెచ్చరించింది.