: ‘సినిమా ఒక ఆల్కెమీ’ పుస్తకం అద్భుతం: నటుడు రానా
సినిమా విశ్లేషకుడు వెంకట సిద్ధారెడ్డి రాసిన ‘సినిమా ఒక ఆల్కెమీ’ పుస్తకం అద్భుతమని ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా అన్నాడు. హైదరాబాద్ లోని ఓ హోటల్ లో ‘సినిమా ఒక ఆల్కెమి’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించాడు. అనంతరం, రానా మాట్లాడుతూ, ప్రపంచ సినిమాలను తెలుగు వారికి ఈ పుస్తకం పరిచయం చేస్తుందని, పుస్తకాలకు ఆదరణ తగ్గుతున్న వేళ ఇలాంటి పుస్తకాన్ని తీసుకురావడం గర్వకారణమని అన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నో అద్భుతమైన సిినిమాల గురించి ఈ పుస్తకంలో వివరించినట్టు చెప్పాడు. కాగా, పుస్తక రచయిత సిద్ధారెడ్డి మాట్లాడుతూ, భవిష్యత్తులో మరో రెండు పుస్తకాలు తీసుకురానున్నట్లు చెప్పారు.