: కాంగ్రెస్ సభను చూసి టీఆర్ఎస్ కు నిద్ర పట్టకూడదు: జగ్గారెడ్డి
జూన్ ఒకటిన ‘తెలంగాణ ప్రజా గర్జన’ పేరిట సంగారెడ్డిలో నిర్వహించే భారీ బహిరంగ సభను రెండు లక్షల మందితో నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. ఈ రోజు నిర్వహించిన కాంగ్రెస్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ సభకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరుకానున్నారని, ఈ సభతో తమ పార్టీ సత్తా చూపిస్తామని, కాంగ్రెస్ పార్టీ సభను చూసి టీఆర్ఎస్ కు నిద్ర పట్టకూడదని అన్నారు. గత ఎన్నికల్లో సెంటిమెంట్ తోనే టీఆర్ఎస్ గెలిచిందని, సంగారెడ్డిలో కాంగ్రెస్ గెలుపును కేసీఆర్ కూడా ఆపలేరని, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం టీఆర్ఎస్ కు లేదని అన్నారు.