: వీరంతా ఎందుకు తర్జనభర్జన పడుతున్నారు?: మోదీ, జగన్ ల భేటీపై వెంకయ్యనాయుడు


భారత ప్రధాని నరేంద్ర మోదీతో వైసీపీ అధినేత జగన్ ఇటీవల భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలుకొని, మంత్రులు, టీడీపీ నేతలు, కమ్యూనిస్టు నేతలు, కాంగ్రెస్ నేతల వరకు అందరూ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటీపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కాస్త ఆలస్యంగా స్పందించారు. ప్రధానితో ఏపీ విపక్ష నేత జగన్ భేటీ అయితే ఇంతమంది ఎందుకు తర్జనభర్జన పడుతున్నారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. ప్రధానితో ఎవరైనా సమావేశం కావచ్చని చెప్పారు. తాము నిలబెట్టే రాష్ట్రపతి అభ్యర్థికి ఎవరు మద్దతిచ్చినా, తాము స్వీకరిస్తామని ఆయన స్పష్టం చేశారు. 

  • Loading...

More Telugu News