: నాకు అతి విలువైన బర్త్ డే విషెస్ ఇవి!: జూనియర్ ఎన్టీఆర్
ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు. నిన్నరాత్రి తన భార్య లక్ష్మీ ప్రణతి, కుమారుడు అభయ్ రామ్ లు తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారని, ‘నా తొలి, ఎంతో విలువైన బర్త్ డే విషెస్ ఆఫ్ ది ఇయర్’ అని ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. ఈ సందర్భంగా అభయ్ ను తన భుజాలపై ఎక్కించుకున్న ఓ ఫొటోను జూనియర్ ఎన్టీఆర్ పోస్ట్ చేశాడు. ‘ఫ్యామిలీ టైమ్! అభయ్ ప్రేమతో నా కళ్లు ఎందుకు మూశాడో నాకు తెలియదు’ అని మరో ట్వీట్ లో యంగ్ టైగర్ పేర్కొన్నాడు. కాగా, జూనియర్ బర్త్ డే సందర్భంగా సామాజిక మాధ్యమాల ద్వారా ఆయన అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.