: సొంత అన్న పైనే పోటీ చేసిన సన్నాసి.. ఓ క్రిమినల్.. నోరు విప్పితే అబద్ధాలే: గొట్టిపాటిపై కరణం బలరాం ధ్వజం


తన ప్రత్యర్థి గొట్టిపాటి రవికుమార్ పై ఎమ్మెల్సీ కరణం బలరాం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గొట్టిపాటి ఓ క్రిమినల్ అని... నిజం చెప్పే అలవాటు ఆయనకు లేదని విమర్శించారు. 'సొంత అన్నపైనే పోటీ చేసిన సన్నాసి' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి సిద్ధాంతాలు లేని వ్యక్తి అని మండిపడ్డారు. ఆయనలా కక్కుర్తి పనులు చేయడం, ఆఫీసర్లను ట్రాన్స్ ఫర్ చేసి పబ్బం గడుపుకునే తత్వం తనది కాదని అన్నారు.

ఉన్నతాధికారుల సహాయంతో నియోజకవర్గానికి మేలు చేయడం మాత్రమే తనకు తెలుసని... గొట్టిపాటిలా నీచమైన రాజకీయాలు చేయడం తనకు తెలియదని చెప్పారు. గొట్టిపాటి బతుకే అబద్ధాల బతుకని ఎద్దేవా చేశారు. అన్నపైనే పోటీ చేసి సొంత కుటుంబంలోనే చిచ్చు పెట్టాడని... తల్లికి-కుమారుడికి, నాయనమ్మకు- మనవడికి, బాబాయ్ కి- కొడుకుకి మధ్య తగాదాలు వచ్చేలా చేసిన నీచుడు గొట్టిపాటి అని ధ్వజమెత్తారు. తన గురించి మాట్లాడే నైతికత కూడా ఆయనకు లేదని అన్నారు.

  • Loading...

More Telugu News