: ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ లో పొగలు!


ఈ మధ్యాహ్నం ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ లో పొగలు వచ్చాయి. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర రైల్వే స్టేషన్ ను దాటుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు తిరుపతి నుంచి కాచిగూడకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో రైలును కాసేపు నిలిపివేశారు. పొగలు వస్తుండటాన్ని గమనించిన ప్రయాణికులు కిందకు దిగి, పరుగులు పెట్టారు. అనంతరం పొగలు వచ్చిన ప్రాంతాన్ని పరిశీలించారు. బ్రేకులు పట్టేయడంతో పొగలు వచ్చినట్టు గుర్తించారు. ఆ తర్వాత కాసేపటికి రైలు యథావిధిగా కదిలింది.

  • Loading...

More Telugu News