: చంద్రబాబు, వైయస్ లలో ఎవరెవరు ఏమేం సాధించారో చర్చిద్దామా?: యనమల సవాల్


వైసీపీ నేతలకు ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సవాల్ విసిరారు. ముఖ్యమంత్రులుగా రాష్ట్రానికి చంద్రబాబు, వైయస్ లు ఎవరెవరు ఏమేం తెచ్చారో చర్చిద్దామా? అంటూ ఛాలెంజ్ చేశారు. పెట్టుబడులను రప్పించేందుకు చంద్రబాబు విదేశీ పర్యటనలు చేస్తుంటే... వైసీపీకి చెందిన పత్రిక విషప్రచారం చేస్తోందని మండిపడ్డారు. వైయస్ విదేశీ పర్యటనలకు వెళ్లి స్కామ్ లు చేసి వచ్చారని ఆయన ఆరోపించారు. వైయస్ జర్మనీకి వెళ్లారని... మరి ఫోక్స్ వ్యాగన్ సంస్థ ఏమైందని ప్రశ్నించారు. రూ. 11 కోట్లకు కక్కుర్తి పడి, ఈ సంస్థ మహారాష్ట్రకు తరలిపోయేలా చేశారని విమర్శించారు.

రాష్ట్ర ప్రగతి కోసం చంద్రబాబు విదేశీ పర్యటనలు చేశారని చెప్పారు. ఆయన పర్యటనల వల్లే కియా, హీరో, ఇసుజు వంటి కంపెనీలు ఏపీకి వచ్చాయని అన్నారు. త్వరలోనే బెల్, డెల్, యాపిల్ లాంటి కంపెనీలు కూడా రాబోతున్నాయని తెలిపారు. 

  • Loading...

More Telugu News