: అంతగా చదువుకోని రజనీకాంత్ ని సీఎంగా ప్రజలు చూడలేరు : సుబ్రహ్మణ్యస్వామి
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాలకు పనికిరారని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి మరోమారు వ్యాఖ్యానించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, విద్యాధికులైన తమిళ ప్రజలు, అంతగా చదువుకోని రజనీకాంత్ ని సీఎంగా చూడలేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయాల్లో చదువుకున్న వాళ్లే ఉండగలరని ఆయన అభిప్రాయపడ్డారు. రజనీకాంత్ తో బీజేపీ పొత్తుపెట్టుకుంటే తాను వ్యతిరేకిస్తానని అన్నారు. అయినప్పటికీ ఆయనతో పొత్తు కొనసాగిస్తే, పార్టీ అధిష్ఠానం ఇష్టమన్నారు. కాగా, రజనీపై సుబ్రహ్మణ్యస్వామి ఇటీవలే విమర్శలు గుప్పించారు. రాజకీయాలకు దూరంగా రజనీకాంత్ ఉండాలని సూచించడం విదితమే.