: మరో చిక్కులో పడ్డ నటి కంగనా రనౌత్!


ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరో వివాదంలో చిక్కుకుంది. బాలీవుడ్ దర్శక నిర్మాత కేతన్ మెహతా ఆమెకు లీగల్ నోటీసులు పంపించారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'రాణి ఆఫ్ ఝాన్సీ.. ది వారియర్ క్వీన్' సినిమాలో నటిస్తానని చెప్పిన కంగనా రనౌత్ ఇప్పుడు 'మణికర్ణిక.. ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ' చిత్రంలో నటిస్తూ తన ప్రాజెక్టును హైజాక్ చేసిందని నోటీసులో ఆయన పేర్కొన్నారు. కంగనాకు తాము నోటీసులు పంపినా...  ఇంతవరకు ఆమె నుంచి రెస్పాన్స్ రాలేదని ఆయన చెప్పారు. తమ సబ్జెక్ట్ తోనే ఆమె మరో చిత్రంలో నటిస్తోందని... ఇది ముమ్మాటికీ విశ్వాస ఘాతుకమే అని మండిపడ్డారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టబోమని... చట్టబద్ధంగా ఎదుర్కొంటామని చెప్పారు. 

  • Loading...

More Telugu News