: 30 కోట్ల పన్ను ఎగ్గొట్టిన నిర్మాత ఏక్తాకపూర్
ప్రముఖ నిర్మాత ఏక్తాకపూర్ కు చెందిన బాలాజీ టెలిఫిలిమ్స్ సుమారు 30 కోట్ల రూపాయల మేర పన్ను ఎగవేతకు పాల్పడిందని ఆదాయపన్ను శాఖ వర్గాలు తెలిపాయి. బిల్లులను వక్రీకరించి ఈ మేరకు తప్పించుకున్నట్లు సమాచారం. అయితే, ఈ మొత్తాన్ని కూడా చెల్లించడానికి ఏక్తా అంగీకరించిందని ఆదాయపు పన్ను వర్గాలు చెప్పాయి. మంగళవారం ముంబైలోని బాలాజీ టెలిఫిలిమ్స్ కార్యాలయం సహా ఏక్తాకపూర్ నివాసాలలో 100 మంది అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.