: ఆ విషయంలో బంగ్లాదేశ్‌, శ్రీలంక‌ల కంటే వెనుకబడిపోయిన భార‌త్


ద‌క్షిణాసియాలో అద్భుతమైన అభివృద్ధి సాధిస్తూ దూసుకుపోతున్న భార‌త్.. ఇటీవ‌లే శ్రీ‌లంక‌, బంగ్లాదేశ్ వంటి చిన్న దేశాల‌కు ఇస్రో ప్ర‌యోగించిన ఉప‌గ్ర‌హం ద్వారా సాంకేతికంగా సాయం కూడా చేసిన విష‌యం తెలిసిందే. ద‌క్షిణాసియాలోనే ఓ లీడ‌ర్‌లా వెలుగొందుతున్న భార‌త్‌.. కొన్ని విష‌యాల్లో మాత్రం ఇప్ప‌టికీ ప‌లు చిన్న దేశాల కంటే వెనుక‌బ‌డే ఉంది. ఆరోగ్య సంర‌క్ష‌ణ ర్యాంకుల్లో గ్లోబ‌ల్ బ‌ర్డెన్ ఆఫ్ డిసీజ్ అనే సంస్థ తాజాగా ప్ర‌క‌టించిన 195 దేశాల ర్యాంకుల్లో భార‌త్‌ 154వ స్థానంలో ఉంది. ఆ విష‌యంలో బంగ్లాదేశ్‌, శ్రీలంక‌ల కంటే భార‌త్ వెనుక‌బ‌డి ఉంది.

 ఆయా దేశాల్లో అందిస్తోన్న‌ నాణ్య‌మైన వైద్యం, అందుబాటులో వైద్యం అంశాల ఆధారంగా బ‌ర్డెన్ ఆఫ్ డిసీజ్ ఈ ర్యాంకుల‌ను ప్ర‌క‌టించింది. 1990తో పోలిస్తే తాజా ర్యాంకుల్లో చైనా, సౌత్‌కొరియా, పెరులాంటి దేశాలు ఎంతో మెరుగైన ర్యాంకు సాధిస్తే భార‌త్ మాత్రం చిన్న దేశాల క‌న్నా వెనుక‌బ‌డే ఉంది. ఆ సంస్థ ప్ర‌క‌టించిన పాయింట్ల‌లో చైనా 74, శ్రీలంక 73, బంగ్లాదేశ్ 52 పాయింట్లు సాధించాయి. భార‌త్‌కి మాత్రం 44.8 పాయింట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. 1990తో పోలిస్తే భార‌త్ 14.1 పాయింట్లు ఎక్కువ‌గా వ‌చ్చాయి. కానీ అనుకున్న విధంగా మాత్రం ప్ర‌గ‌తి క‌న‌బ‌ర్చ‌లేక‌పోయింది. భార‌త్‌లో టీబీ, డ‌యాబెటిస్‌, గుండె, కిడ్నీల‌కు సంబంధించిన వ్యాధులు పెరిగిపోతూనే ఉన్నాయ‌ని, వీటిని  అరిక‌ట్టే విష‌యంలో ఘోరంగా విఫ‌ల‌మైంద‌ని నివేదికలో పేర్కొన్నారు. మ‌రో‌వైపు అగ్రరాజ్యం అమెరికా కూడా గ‌తంలో కంటే భారీగా ర్యాంకును కోల్పోయి 35వ స్థానంలో నిలిచింది.

  • Loading...

More Telugu News