: యూఎస్ ఇమిగ్రేషన్ అధికారుల కస్టడీలో మరణించిన భారతీయుడు


ఈక్వెడార్ నుంచి అట్లాంటా విమానాశ్రయానికి వచ్చిన ఓ భారతీయుడిని నిర్బంధించిన ఇమిగ్రేషన్ అధికారులు, అతన్ని వారం రోజుల నుంచి డిటెన్షన్ సెంటర్ లో ఉంచగా, గుండెపోటుతో అతను మరణించాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే, అతుల్ కుమార్ బాబూభాయ్ పటేల్ (58) అనే వ్యక్తి సరైన ఇమిగ్రేషన్ పత్రాలు సమర్పించలేదని ఆరోపిస్తూ, అధికారులు మే 10న అరెస్ట్ చేసి, కస్టమ్స్ ఎన్ ఫోర్సుమెంట్ కు అప్పగించారు.

అప్పటి నుంచి అట్లాంటా సిటీ డిటెన్షన్ సెంటర్ లో ఉంచారు. మొదటి రోజే అతనికి అధిక రక్తపోటు, మధుమేహ వ్యాధులు ఉన్నాయని గుర్తించారు. ఆపై రోజువారీ పరీక్షల్లో భాగంగా, అతను శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడుతున్నారని ఓ నర్సు గుర్తించగా, వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అతుల్ కుమార్ మరణించారు. ఈ తరహా ఘటనలు చాలా అరుదని, డిటెన్షన్ సెంటర్ లో ఉన్న వారికి అన్ని సదుపాయాలనూ తాము కల్పిస్తుంటామని, వారి ఆరోగ్యంపైనా శ్రద్ధ చూపుతామని, ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News