: ఆర్ణబ్ గోస్వామి కొత్త టీవీ ఛానల్ కు నోటీసులు ఇచ్చిన హైదరాబాద్ పోలీసులు
ప్రముఖ జర్నలిస్ట్ ఆర్ణబ్ గోస్వామి ఎడిటర్-ఇన్-చీఫ్ గా వ్యవహరిస్తున్న కొత్త న్యూస్ ఛానల్ 'రిపబ్లిక్ టీవీ'కి హైదరాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఐసిస్ సానుభూతిపరుల ఇంటర్వ్యూను ప్రసారం చేసినందుకు ఈ నోటీసులు జారీ చేశారు. ఛానల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు. ఐసిస్ సానుభూతిపరులైన సల్మాన్ మొహినుద్దీన్, ఖురేషి, అబ్దుల్లా బాసిత్ లను రిపబ్లిక్ టీవీ ప్రతినిధి ఇంటర్వ్యూ చేశారు. ఐసిస్ తో సంబంధాలకు సంబంధించిన ఈ ఇంటర్వ్యూను ప్రసారం చేసినందుకు నోటీసులు జారీ చేశారు.
మరోవైపు, ఇంటర్వ్యూ ఇచ్చిన ముగ్గురినీ అరెస్ట్ చేసి, మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు హైదరాబాద్ పోలీసులు. కాగా, 'టైమ్స్ నౌ' ఛానల్ కు రాజీనామా చేసిన ఆర్ణబ్ గోస్వామి 'రిపబ్లిక్ టీవీ' పేరుతో కొత్త న్యూస్ ఛానల్ ను స్థాపించారు.