: 'అప్పుడు మాత్రం భయపడ్డా'నంటున్న కోహ్లీ


ఐపీఎల్‌ సీజన్ 10లో అతి తక్కువ విజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచి టోర్నీ నుంచి ముందుగా నిష్క్రమించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమవుతున్నాడు. మరోపక్క, వాణిజ్య ప్రకటనలతోపాటు తనకు సంబంధించిన ట్రస్టు, వ్యాపారాలు, ఇతర కార్యక్రమాలపై దృష్టిపెట్టాడు. తాజాగా బుద్ధ ఇంటర్నేషనల్‌ సర్క్యూట్‌ లో తన 'ఆడి ఆర్‌8' స్పోర్ట్స్‌ కారులో 280 కిమీ వేగంతో చక్కర్లు కొట్టాడు. ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ, 'ఈ సర్క్యూట్ పై గతంలో 290 కిమీ వేగాన్ని కూడా అందుకున్నాను, కానీ ప్రొఫెషనల్‌ డ్రైవర్‌ తరహాలో బ్రేక్‌ లు వేయలేకపోయాను. ఆ సమయంలో భయమేసింది కూడా’ అన్నాడు. ఈ సమయంలో కోహ్లీ చాలా ఉల్లాసంగా కనిపించడం విశేషం.

  • Loading...

More Telugu News