: టీఎస్ ఐఐసీ వేలం పాటకు అనూహ్య స్పందన.. రాయదుర్గంలో ఎకరం భూమి రూ.43 కోట్లు


తెలంగాణ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ నిర్వహించిన వేలం పాటకు అనూహ్య స్పందన వచ్చింది. ఐటీ కారిడార్ రాయదుర్గంలో ఎకరం భూమి ఏకంగా రూ.42.5 కోట్లు పలికింది. మొత్తం ఐదెకరాలను వేలం వేసిన ఐఐసీ ఏకంగా రూ.185 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంది. రాయదుర్గంలో చదరపు గజానికి రికార్డు స్థాయిలో రూ.88వేలు పలికింది. ఆదిత్య బిల్డర్స్, ఎంఎస్ ఇన్‌ఫ్రా‌లు ఈ రికార్డు ధరకు భూములను సొంతం చేసుకున్నాయి. ఊహించని విధంగా వేలానికి అనూహ్య స్పందన రావడంతో ఐఐసీ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది.

  • Loading...

More Telugu News