: ఐపీఎల్ ఫైనల్ లో పూణేతో తలపడేదెవరో తేలేది నేడే!


ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో రెయిజింగ్ పూణే సూపర్ జెయింట్ తో తలపడే జట్టుపై నేడు స్పష్టత రానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో ఓడిన ముంబై ఇండియన్స్ జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ లో విజయం సాధించిన కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది. ఈ నేపథ్యంలో రెండు జట్లు విజయమే లక్ష్యంగా బరిలో దిగుతున్నాయి. ముంబై ఇండియన్స్ జట్టు ఈ టోర్నీలో కేకేఆర్ తో జరిగిన రెండు మ్యాచ్ లలో విజయం సాధించి, ఆత్మవిశ్వాసంతో బరిలో దిగనుండగా, చిన్నస్వామి స్టేడియంలో ఎలిమినేటర్ మ్యాచ్ లో నెగ్గి, ముంబైని ఓడించాలన్న కసితో కోల్ కతా నైట్ రైడర్స్ బరిలో దిగనుంది. కాగా, గంభీర్ భీకరమైన ఫాంలో ఉండగా, రోహిత్ కూడా ఆకట్టుకుంటున్నాడు. ఈ మ్యాచ్ ను విశ్లేషకులు తొలి ఫైనల్ గా పేర్కొంటున్నారు. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో ఆడనుంది.

  • Loading...

More Telugu News