: హైదరాబాదు పాతబస్తీలో భారీ బందోబస్తు...భారీగా మోహరించిన పోలీసులు
హైదరాబాదులోని పాతబస్తీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మక్కామసీదులో పేలుళ్లు జరిగి నిన్నటికి పదేళ్లు పూర్తైన నేపథ్యంలో నేడు శుక్రవారం కావడంతో ప్రత్యేక ప్రార్ధనలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ మండలం పరిధిలోని పోలీసులు పాతబస్తీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చార్మినార్, మక్కా మసీదు పరిసరాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లను మోహరించాయి. నిన్న మధ్యాహ్నం 12.30 గంటలకు అజాన్ కాగా, 1.20 గంటలకు నమాజ్ ముగిసింది. నేడు కూడా బలగాలు పహారా కాస్తున్నాయి. సున్నితమైన ప్రాంతం కావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిన్నటి నుంచి భారీగా పోలీసులను మోహరించారు. నిన్ని ప్రార్థనలు ప్రశాంతంగా ముగియడంతో నేడు కూడా అలాగే ముగుస్తాయని ఆశిస్తున్నారు.