: తన విగ్రహాన్ని తానే ఆవిష్కరించిన శిల్పాశెట్టి!
పొడుగు కాళ్ల సుందరి, ఫిట్ నెస్ కు మారు పేరైన బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి యోగా పోజ్ లో ఉన్న విగ్రహాన్ని ముంబయిలోని ఓ పార్కులో ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ఈ రోజు తనే స్వయంగా ఆవిష్కరించింది. అనంతరం, ఆ పార్కులో కొన్ని యోగాసనాలు వేసిన శిల్పాశెట్టి, యోగా చేయడం వల్ల ఒనగూరే ప్రయోజనాల గురించి చెప్పింది. ఆమెను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.