: తల్లిని మించి పోజులిచ్చిన ఐశ్వర్యరాయ్ కూతురు!
మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య అప్పుడే ఫొటోలకి అద్భుతంగా పోజులిచ్చేస్తోంది. ఆరేళ్లు కూడా నిండకుండానే అచ్చం తన తల్లిలాగే కెమెరాల ముందు పోజులిచ్చి అందరి దృష్టినీ ఆకర్షించేసింది. కేన్స్ అంతర్జాతీయ వేడుకల్లో పాల్గొనేందుకు నిన్న రాత్రి ఐశ్వర్య తన కూతురు, భర్తతో కలిసి ముంబయి నుంచి ఫ్రాన్స్ బయలుదేరింది. కూతురి చెయ్యి పట్టుకొని ఐష్ నడుస్తూ వెళుతుండగా ఫొటోగ్రాఫర్లందరూ ఆమె వెంటే పడ్డారు. అదే సమయంలో ఆరాధ్య వయ్యారంగా ఫొటోకి పోజులు ఇచ్చి ఫొటోగ్రాఫర్ల దృష్టిని ఆకర్షించింది. దీంతో ఐశ్వర్యారాయ్ కంటే ఎక్కువ ఆరాధ్య ఫొటోలనే తీసుకున్నారు. ఆ చిన్నారి ఫుల్లుగా పోజులు కొడుతూ ఫొటోలకు స్టిల్స్ ఇచ్చిన తీరుని చూసిన ప్రయాణికులు కూడా ఆశ్చర్యపోయారు.
#Bollywood #Queen #AishwaryaRai With Her Daughter #Aaradhya