: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ : అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న టీమిండియా


ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా నెంబ‌ర్ 1 ర్యాంకును నిల‌బెట్టుకుంది. ఈ రోజు ఐసీసీ ప్ర‌క‌టించిన ర్యాంకింగ్స్‌లో టీమిండియా 123 పాయింట్లతో అగ్ర‌స్థానంలో నిల‌వ‌గా, 117 పాయింట్ల‌తో ఆ త‌రువాతి స్థానంలో ద‌క్షిణాఫ్రికా నిలిచింది. ఇక 100 పాయింట్ల‌తో ఆస్ట్రేలియా మూడ‌వ స్థానం, 99 పాయింట్ల‌తో ఇంగ్లండ్ నాలుగ‌వ స్థానం, 97 పాయింట్ల‌తో న్యూజిలాండ్ ఐద‌వ స్థానంలో ఉన్నాయి. ఆ తరువాతి స్థానాల్లో వ‌రుస‌గా పాకిస్థాన్‌, శ్రీ‌లంక‌, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌, జింబాబ్వే క్రికెట్ జ‌ట్లు ఉన్నాయి. మరోవైపు వన్డే ర్యాంకింగ్స్ లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా ఒకటి, రెండవ స్థానాల్లో ఉండగా టీమిండియా మూడవ స్థానంలో ఉంది. 

  • Loading...

More Telugu News