: రాబోయే 30 నిమిషాల్లో చిత్తూరులోని రామకుప్పం, సింగసముద్రం గ్రామాల్లో పిడుగుపడే అవకాశం.. విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరిక
చిత్తూరు జిల్లా రామకుప్పం, సింగసముద్రం గ్రామాలకు మూడు కిలోమీటర్ల పరిధిలో పిడుగు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరో 30 నిమిషాల్లోనే పిడుగు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నిన్న కుప్పం మండలం కనుగోడులో పిడుగు పడే అవకాశం ఉన్నట్టు విపత్తు నిర్వహణ శాఖ ముందుగానే హెచ్చరించిన విషయం తెలిసిందే. ప్రజలను హెచ్చరించినట్లుగానే కుప్పం మండలం కనుగోడులో పిడుగు పడింది. ఈ రోజు అటువంటి హెచ్చరికే చేసి ప్రజలను అప్రమత్తం చేసింది.