: అమిత్ షా ఏపీ పర్యటన ఖరారు.. 25న విజయవాడకు రాక


బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏపీ పర్యటన ఖరారైంది. ఈ నెల 25న విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీ మైదానంలో బీజేపీ బూత్ కమిటీ కార్యకర్తల మహా సమ్మేళనం జరగనుంది. ఈ కార్యక్రమానికి అమిత్ షా హాజరుకానున్నారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు సురేష్ ప్రభు, వెంకయ్యనాయుడులు కూడా హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఏపీ మంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో 23 వేల బూత్ లకు కమిటీలను వేశామని తెలిపారు. 25న జరగనున్న మహా సమ్మేళనానికి 13 జిల్లాల నుంచి ప్రతి బూత్ కు ముగ్గురు చొప్పున హాజరవుతారని చెప్పారు. 

  • Loading...

More Telugu News