: శుభవార్త తెలిపిన యాక్సిస్ బ్యాంకు... గృహరుణాలపై వడ్డీరేట్ల తగ్గింపు


ఇత‌ర బ్యాంకుల బాట‌లోనే పయ‌నిస్తూ ప్రైవేటు బ్యాంకింగ్ రంగ దిగ్గ‌జ సంస్థ యాక్సిస్ బ్యాంకు కూడా ఓ శుభ‌వార్త తెలిపింది. గృహరుణాలపై వడ్డీరేట్లను 30 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్న‌ట్లు, అఫార్డబుల్ హౌజింగ్ ఫైనాన్స్ ను అందించే లక్ష్యంతో ఈ రేట్లను సమీక్షించినట్టు పేర్కొంది. ఇండస్ట్రీలోనే అత్యంత కనిష్టస్థాయి వ‌డ్డీకి గృహ‌రుణాల‌ను అందిస్తున్న‌ట్లు తెలిపింది. ఈ రేట్ల ప్ర‌కారం 30 లక్షల రూపాయ‌ల‌ వరకున్న శాలరీ సెగ్మెంట్లో గృహరుణాలపై వడ్డీరేటు 8.35 శాతానికే అందుబాటులో ఉండ‌నుంది. 30-75 లక్షల వరకు ఉన్న శాలరీ సెగ్మెంట్‌లో 8.65 శాతం అందుబాటు ఉంటుంది. ఇక‌ 75 లక్షలకు పైబడి ఉన్న శాలరీ సెగ్మెంట్‌లో 8.70శాతం వ‌డ్డీరేటు ఉంటుంది. ఈ నెల 16 నుంచే ఈ వడ్డీరేట్లు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపింది.

  • Loading...

More Telugu News