: జర్మనీ నుంచి వచ్చి నిషిత్ మరణించిన ప్రాంతాన్ని పరిశీలించిన మెర్సిడిస్ బెంజ్ ప్రతినిధులు


ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ కారు ప్రమాదంలో మృతి చెందిన హైదరాబాదులోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని స్థలాన్ని మెర్సిడిస్ బెంజ్ సంస్థ ప్రతినిధులు పరిశీలించారు. కారు ప్రమాదంపై సమాచారాన్ని అందుకున్న సంస్థ ఉన్నతాధికారులు, అన్ని రకాల రక్షణ వ్యవస్థలున్న కారు అంతలా ఎలా దెబ్బతిందన్న విషయాన్ని పరిశీలించేందుకు రెండు రోజుల క్రితమే జర్మనీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు.

ఈ ఉదయం జూబ్లీహిల్స్ చెక్ పోస్టు సమీపంలోని 9వ నంబర్ పిల్లర్ వద్దకు వచ్చిన బెంజ్ అధికారులు, అక్కడి టర్నింగును, ఆపై సీసీటీవీలో రికార్డయిన ఫుటేజ్ నీ పరిశీలించారు. బోయిన్ పల్లిలోని బెంజ్ షోరూంలో ఉన్న నిషిత్ కారును కూడా వారు పరిశీలించారు. హైదరాబాద్ పోలీసుల సూచన మేరకు, ప్రమాదంపై వీరు కంపెనీ తరఫున వివరణ ఇవ్వనున్నారు.

  • Loading...

More Telugu News