: బోఫోర్స్ గన్స్ వచ్చిన 30 ఏళ్ల తరువాత... నేడు సైన్యం చేతికి అందిన ఎం-777 హోవిట్జర్ గన్స్


1980లో స్వీడన్ నుంచి బోఫోర్స్ గన్స్ కొనుగోలు చేసిన తరువాత, అంతకు మించిన శక్తి సామర్థ్యాలతో పనిచేసే సరికొత్త గన్స్ నేడు భారత సైన్యం చేతికి అందాయి. సుమారు 700 మిలియన్ డాలర్ల విలువైన 145 ఎం-777 అల్ట్రా లైట్ హోవిట్జర్ గన్స్ కావాలని అమెరికాకు ఆర్డర్ ఇచ్చిన భారత రక్షణ శాఖ నేడు రెండు గన్స్ ను అందుకుంది. భారత సైన్యాన్ని ఆధునికీకరించాలన్న ఏకైక లక్ష్యంతో అడుగులు వేస్తున్న కేంద్రం రూ. 22 వేల కోట్ల అంచనా వ్యయంతో, పలు రకాల నూతన ఆయుధాల కొనుగోలుకు డీల్స్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

చేతికందిన హోవిట్జర్ గన్స్ ను చైనా సరిహద్దుల్లో సముద్ర మట్టానికి ఎత్తైన ప్రాంతాల్లో వినియోగిస్తామని సైనికాధికారి ఒకరు తెలిపారు. కాగా, హోవిట్జర్ గన్స్ డీల్ ను గత సంవత్సరం నవంబర్ 17న కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన సంగతి తెలిసిందే. గరిష్ఠంగా 30 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సునాయాసంగా, వేగంగా ఛేదించే హోవిట్జర్ గన్స్ రాకతో సైనిక సామర్థ్యం మరింతగా పెరిగిందని రక్షణ శాఖ వ్యాఖ్యానించింది. వీటిని బీఏఈ సంస్థ తయారు చేస్తుండగా, తొలి 25 గన్స్ డెలివరీ అనంతరం మిగతా 120 గన్స్ 'మేకిన్ ఇండియా'లో భాగంగా మహీంద్రా సంస్థ అమెరికా నుంచి విడిభాగాలు తెప్పించి ఇక్కడే తయారు చేయనుంది.

  • Loading...

More Telugu News