: గుంటూరు-గుంతకల్లు రైల్వే లైన్ డబ్లింగ్.. 10 అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణం: వెంకయ్య నాయుడు


విద్యుత్ ఉత్పత్తిని భారీ ఎత్తున పెంచే లక్ష్యంతో కొత్తగా 10 అణు విద్యుత్ కేంద్రాలను నిర్మించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఈ కేంద్రాలను నిర్మిస్తారు. దేశీయంగా తయారైన భారజలం ఆధారంగా ఈ కేంద్రాలలో అణు విద్యుత్తును తయారు చేస్తారు. ఈ ప్రాజెక్టులు పూర్తైతే దేశ అణు విద్యుత్ ఉత్పాదకత రెట్టింపవుతుందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. వీటికి తోడు ఏపీతో సహా మూడు రాష్ట్రాలకు భారీ రైల్వే ప్రాజెక్టులను కేంద్రం ప్రకటించింది. ఇందులో భాగంగా గుంటూరు-గుంతకల్లు రైల్వే లైన్ డబ్లింగ్, విద్యుదీకరణ చేయనున్నారని వెంకయ్య తెలిపారు. ఈ ప్రాజెక్టు రాయలసీమకు చాలా మేలు చేస్తుందని చెప్పారు. పారిశ్రామికాభివృద్ధిలో ఈ లైన్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. 

  • Loading...

More Telugu News