: ధోనీని విమర్శించిన నోరే పొగుడుతోంది!


ఐపీఎల్ సీజన్ 10లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్ కెప్టెన్ గా ధోనీని తొలగించి స్టీవ్ స్మిత్ ను నియమించిన సందర్భంగా టీమ్ మేనేజ్ మెంట్ అతనిపై పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై విజయం సందర్భంగా ‘అడవికి రాజు ఎవరో అనేది స్మిత్‌ నిరూపించాడు. ధోనీనీ అతడు ప్రేక్షక పాత్రకే పరిమితం చేశాడు. అతడిని సారథిగా నియమించడం సరైన నిర్ణయం’ అంటూ పూణే జట్టు యజమాని సంజీవ్ గోయెంకా సోదరుడు హర్ష్ గొయెంకా ట్వీట్ చేసి కలకలం రేపాడు.

తాజాగా ఫైనల్ క్వాలిఫయర్ మ్యాచ్ లో మళ్లీ ముంబై ఇండియన్స్ తో తలపడిన మ్యాచ్ పై ట్వీట్ చేసిన హర్ష్ గొయెంకా... ‘ధోనీ విధ్వంసకర బ్యాటింగ్‌. వాషింగ్టన్‌ సుందర్‌ అసాధారణ బౌలింగ్‌, స్టీవ్‌ స్మిత్‌ గొప్ప కెప్టెన్సీతో రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్‌ ఐపీఎల్‌-10 పదో సీజన్‌ ఫైనల్లో అడుగుపెట్టింది’ అని ట్వీటారు... దీంతో నెటిజ్లను మరోసారి ఆయనపై మండిపడుతున్నారు. అప్పుడు విమర్శించిన నోరే ఇప్పుడు పొగుడుతోందని ఆక్షేపిస్తున్నారు. 

  • Loading...

More Telugu News