: ప్రేమించి పెళ్లి చేసుకున్న కూతురు... అల్లుడిని కాల్చి చంపిన మామ!
జైపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. మమత అనే యువతి వేరే కులానికి చెందిన అమిత్ నాయర్ అనే యువకుడిని పెళ్లి చేసుకోవడంతో అతడిపై మమత కుటుంబ సభ్యులు కాల్పులు జరిపారు. దీంతో సివిల్ ఇంజినీర్‌గా పనిచేస్తోన్న అమిత్ నాయర్ పెళ్లయిన రెండేళ్లకే తనువు చాలించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు వివరాలు తెలిపారు.
జీవన్‌రాం చౌధరి, భగ్‌వానీ ఛౌధరి దంపతులు తమ కుమార్తె ఇతర కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో ఆగ్రహంతో ఉన్నారు. వారిద్దరు జగదాంబ విహార్ కాలనీలో కాపురం పెట్టారని, మమత గర్భం దాల్చిందని తెలుసుకున్నారు. దీంతో జీవన్‌రాం చౌధరి ఓ తుపాకి తీసుకొని, తన భార్య మరో ఇద్దరిని తీసుకుని ఈ రోజు తన కుమార్తె ఇంటికి వెళ్లి ఇంట్లోనే ఉన్న అమిత్‌ను కాల్చేశాడు. ఈ ఘటనలో నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.