: వివాదాస్పద ఇమామ్ బర్కాతి తొలగింపు!


హిందూ రాజ్యంగా భారత్ ను ప్రకటిస్తే జీహాద్ కు సిద్ధంగా ఉండాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు, ప్రముఖులపై వివాదాస్పద ఫత్వాలు జారీ చేసిన కోల్ కతాలోని టిప్పు సుల్తాన్ మసీదు షాహీ ఇమామ్ సయ్యద్ నూర్ ఉర్ రెహ్మాన్ బర్కాతిని ఆ పదవి నుంచి తొలగించారు. దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం, చర్యలకు పాల్పడటంతో బర్కాతిని ఆ పదవి నుంచి తొలగించినట్టు మసీదు ట్రస్టీ సభ్యులు తెలిపారు. ఈ మేరకు నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కాగా, గత జనవరిలో ప్రధాని నరేంద్రమోదీకి బర్కతి ఫత్వా జారీ చేసి సంచలనం సృష్టించారు. అంతేకాకుండా ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ, రచయత్రి తస్లీమా నస్రీన్ తదితరులకు ఆయన ఫత్వా జారీ చేశారు.

  • Loading...

More Telugu News