: మరోసారి అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి.. పైరట్లను తరిమికొట్టిన భారత నౌకాదళం
భారత నౌకాదళం మరోసారి అత్యంత ధైర్యసాహసాలను ప్రదర్శించి సముద్రపు దొంగలను తరిమికొట్టింది. గల్ఫ్ ఆఫ్ అడెన్‌లో లైబీరియాకు చెందిన ఎంవీ లార్డ్ మౌంట్‌బటన్ నౌకను కాజేయాలని చూసిన పైరట్లను అక్కడి నుంచి పారిపోయేలా చేసింది. రెండు చిన్నపాటి నౌకల్లో వచ్చిన పైరట్లు మౌంట్‌బటన్‌ను హైజాక్ చేసేందుకు ప్రయత్నించగా, ఈ విషయాన్ని గర్తించిన భారత నౌకదళం వెంటనే స్పందించింది.
ఆ భారీ నౌక నుంచి డిస్ట్రెస్ కాల్ సిగ్నల్ అందుకున్న భారత్ నేవీకి చెందిన ఐఎన్ఎస్ శారద వెంటనే 30 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న ఆ ప్రాంతానికి చేరుకుంది. అయితే, ఈ విషయాన్ని గుర్తించిన పైరట్లు వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. భారత నౌకాదళ కమాండర్లు మాత్రం హెలికాప్టర్‌తో పైరట్లను వెంటాడినట్లు సమాచారం.