: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని కంప్యూటర్ల హ్యాకింగ్!
ప్రపంచాన్ని వణికిస్తోన్న కంప్యూటర్ల హ్యాకింగ్ కలకలం ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని కూడా తాకింది. ఏపీ సచివాలయంలో కొన్ని కంప్యూటర్లు హ్యాకింగ్ కు గురయ్యాయని గుర్తించిన ఐటీ నిపుణులు వాటిని సరిచేసేందుకు కుస్తీ పడుతున్నారు. హ్యాకింగ్‌కు గురైన కంప్యూటర్లలో కొత్త హార్డ్ డిస్కులను ఇన్స్టాల్ చేస్తున్నారు. హ్యాకర్లు పంపించిన ఈ వైరస్ వన్నా క్రై వైరసేనా? అనే అంశం తెలియాల్సి ఉంది. సుమారు 20 నుంచి 30 కంప్యూటర్లు హ్యాకింగ్ కు గురైనట్లు తెలుస్తోంది. నిన్ననే తెలంగాణ సచివాలయంలో వైరస్ ఎఫెక్ట్ పడడంతో అక్కడ ఇంటర్నెట్ సేవలను నిలిపి వేసిన విషయం తెలిసిందే.