: భార్య సినిమా చూస్తుంటే..సెహ్వాగ్ మ్యాచ్ చూశాడు!


మాజీ క్రికెటర్  వీరేంద్ర సెహ్వాగ్  ట్వీట్ చేశాడంటే ‘పంచ్’ ఉండి తీరాల్సిందేనని మరోమారు నిరూపించుకున్నాడు. నిన్న తన భార్యతో కలసి ఓ థియేటర్లో సినిమా చూసేందుకు వెళ్లానని, అయితే, ఆమె మూవీ చూస్తుంటే, తాను మాత్రం తన మొబైల్ లో క్రికెట్ మ్యాచ్ చూశానని, దీంతో తామిద్దరం సంతోషంగా ఉన్నామని ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. ‘భార్య సంతోషంగా ఉందంటే జీవితం ఆనందంగా ఉన్నట్టు. ఓ థియేటర్ లో, నేను మ్యాచ్ చూశాను. నేనూ ఖుషీ, భార్యా ఖుషీ. చిన్న సరదాలు’ అని ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. ఆ థియేటర్ లో కూర్చుని ఉన్న సెహ్వాగ్, తన చేతిలో మొబైల్ తో పోజిచ్చిన ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

  • Loading...

More Telugu News