: జన సేనాని పవన్ పోటీ చేసే నియోజక వర్గం కదిరా? గుంతకల్లా?
వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుంచి తాను పోటీ చేస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఆ జిల్లాలో ఏ నియోజకవర్గం నుంచి పవన్ బరిలోకి దిగుతారనే విషయం ఆయన అభిమానుల్లో, రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో, కదిరి నియోజకవర్గం నుంచి పవన్ పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ పార్టీ నేత ఒకరు చెబుతున్నారు. అలాగే, గుంతకల్లు నియోజకవర్గంపైనా పవన్ దృష్టి ఉందని తెలుస్తోంది. ఈ రెండు నియోజకవర్గాల్లో పవన్ అభిమానుల సంఖ్య విపరీతంగా ఉండటంతో, ఆయా నియోజకవర్గాలపైనే జన సేనాని దృష్టి పెట్టినట్టు సమాచారం. మరోపక్క, అనంతపురం నియోజకవర్గం నుంచి తాను బరిలోకి దిగితే ఎలా ఉంటుందనే విషయాన్నీ పవన్ తన సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తోంది.