: ఉత్తర కొరియాకు మద్దతిస్తారా?.. మాకు మద్దతిస్తారా?: అమెరికా


త‌మ‌కు అడ్డువ‌స్తే అమెరికాపై అణుదాడి చేస్తామని ఉత్తరకొరియా ఇప్పటికే పలుసార్లు బహిరంగంగా ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఉత్త‌ర‌కొరియా మ‌రో మిస్సైల్ ప్ర‌యోగం కూడా చేసి అల‌జ‌డి రేప‌డంతో దుందుడుకు చర్యలకు పాల్పడుతున్న ఆ దేశంపై అగ్ర‌రాజ్యం అమెరికా మ‌రోసారి ఆగ్ర‌హం వ్యక్తం చేసింది. ఆ దేశానికి మద్దతిచ్చే దేశాలకు హెచ్చరికలు జారీ చేస్తూ... ఐక్యరాజ్యసమితి ద్వారా ఉమ్మడిగా చేసుకున్న ఒప్పందాలను మర్చిపోయారా? అంటు  ప్ర‌శ్నించింది. ఆయా దేశాలు త‌మ‌కు మ‌ద్ద‌తిస్తాయో, లేక ఉత్త‌ర‌కొరియాకు మ‌ద్ద‌తు ఇస్తాయో తేల్చుకోవాల‌ని ఐక్యరాజ్యసమితిలో అమెరికా ప్రతినిధి నిక్కీ హేలీ అన్నారు. త్వ‌ర‌లో ఐరాస భ‌ద్ర‌తి మండ‌లి స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఆమె ఇటువంటి వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.  

  • Loading...

More Telugu News