: పవన్ ట్విట్టర్ ఖాతాలో ట్వీట్లు వస్తే పట్టించుకోవద్దు: జనసేన


జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ ఖాతాలో ఏవైనా ట్వీట్లు కనిపిస్తే, వాటిని పట్టించుకోవద్దని జనసేన ఓ ప్రకటనలో కోరింది. మూడు రోజుల నుంచి పవన్ ట్విట్టర్ ఖాతా తెరచుకోవడం లేదని, అది హ్యాక్ అయిందని గుర్తించామని జనసేన కార్యాలయం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఉత్తరాది ఐఏఎస్ ను టీటీడీ అధికారిగా ప్రకటించిన విషయంలో పవన్ స్పందనే ఆయన ఆఖరి ట్వీట్ అని తెలిపింది. తన ఖాతా హ్యాక్ పై సైబర్ నిపుణులతో పవన్ స్వయంగా చర్చిస్తున్నారని, ఈ విషయంలో సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేస్తామని తెలిపింది. ట్విట్టర్ ఖాతాను తిరిగి తమ అధీనంలోకి తెచ్చుకునే వరకూ అందులో కనిపించే ట్వీట్ల గురించి ఆలోచించవద్దని అభిమానులను, కార్యకర్తలను జనసేన కోరింది.

  • Loading...

More Telugu News