: అమ్మకాల్లో దుమ్మురేపిన శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8.. 50 లక్షల ఫోన్ల విక్రయం


ఇటీవల శాంసంగ్ విడుదల చేసిన గెలాక్సీ ఎస్ 8, 8 ప్లస్ మోడళ్లు ప్రపంచవ్యాప్తంగా అమ్మకాల్లో దుమ్మురేపాయి. ఇప్పటి వరకు ఏకంగా 50 లక్షల ఫోన్లు విక్రయించినట్టు సంస్థ తెలిపింది. మొత్తం 120 దేశాల్లో వీటిని విక్రయించినట్టు పేర్కొంది. అమ్మకాలు జోరుగా సాగుతుండడంతో ఈ ఏడాది రెండో త్రైమాసికంలో శాంసంగ్ మంచి లాభాలను ఆర్జించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణల అంచనా. కాగా ఈ ఫోన్లు విడుదల చేసినప్పుడు డిస్‌ప్లే ఎర్ర రంగులో వస్తున్నట్టు ఫిర్యాదులు రావడంతో స్పందించిన శాంసంగ్ వెంటనే సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసి విడుదల చేసింది. చైనాలో గెలాక్సీ ఎస్8, 8 ప్లస్ మోడళ్లను ఈనెలాఖరులోగా విడుదల చేసే అవకాశం ఉందని శాంసంగ్ తెలిపింది.

  • Loading...

More Telugu News