: నల్గొండ పోలీస్ స్టేషన్ లో కోమటిరెడ్డిపై కేసు నమోదు


నల్గొండ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ, అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించి, శాంతి భద్రతలకు ఆటంకం కలిగించారని, కోమటిరెడ్డి ఉద్దేశపూర్వకంగానే ఘర్షణకు దిగారని అన్నారు. కాగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం మిర్యాలగూడ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. ఆయన్ని ఎప్పుడు విడుదల చేస్తారన్న విషయమై పోలీసులు స్పష్టమైన సమాచారం ఇవ్వనట్టు తెలుస్తోంది. ఈ అర్థరాత్రికి కోమటిరెడ్డిని హైదరాబాద్ కు తరలించే అవకాశాలున్నట్టు సమాచారం. 

  • Loading...

More Telugu News