: తెలంగాణ సచివాలయంలో ఇంటర్నెట్ సేవల నిలిపివేత
వాన్నా క్రై ర్యాన్సమ్ వేర్ వైరస్ ఎఫెక్ట్ తెలంగాణ సచివాలయంపై పడింది. ఇక్కడి ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. కాగా, ఈ వైరస్ కారణంగా నూట యాభై దేశాల్లోని ప్రముఖ వ్యాపార కేంద్రాలను, సంస్థలను తీవ్ర ఇబ్బంది పెట్టిన విషయం తెలిసిందే.