: తీపికబురు చెప్పిన నోకియా.. బడ్జెట్ ధరలో ఎల్లుండే మార్కెట్లోకి నోకియా ఫోన్
అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోన్న నోకియా ఫోన్‌ల అమ్మకాలు ఎల్లుండి నుంచే ప్రారంభం కానున్నాయని హెచ్ఎండీ గ్లోబల్ తెలిపింది. నోకియా 3310 పేరిట మార్కెట్లోకి వస్తోన్న ఈ ఫోన్ ధర కూడా రూ.3310 అని తెలిపింది. ఈ ఫోన్ లు నాలుగు రంగుల్లో లభిస్తాయని పేర్కొంది. వార్మ్ రెడ్, ఎల్లో రంగుల్లోని ఫోన్లు గ్లోస్ ఫినిష్‌లో, డార్క్ బ్లూ, గ్రే ఫోన్లు మెటల్ ఫినిష్‌లో అందుబాటులోకి రానున్నట్లు చెప్పింది. ఈ ఫోన్ల డిజైన్‌లు కస్టమర్లకు బాగా నచ్చుతాయని తెలిపింది. ఈ ఫోన్‌లు ఒక్కసారి ఛార్జింగ్ తో రోజంతా మాట్లాడుకోవచ్చని చెప్పింది. ఈ 2జీ ఫోన్లలో ఎఫ్ఎం రేడియా, జ్యూక్ బాక్స్, ఎంపీ 3 ప్లేయర్, ఫొటోలు తీసుకునే సౌకర్యాలు ఉంటాయని వివరించింది.
నోకియా 3310 ఫీచర్లు..
- డ్యూయల్ సిమ్(మైక్రో సిమ్)
- నోకియా సిరీస్ 30 + ఆపరేటింగ్ సిస్టం
- 2.4 ఇంచెస్ కర్వ్‌డ్ విండో కలర్ క్యూవీజీఏ (240X 320) డిస్‌ప్లే
- మైక్రో యూఎస్‌బీ,
- బ్లూటూత్
- 2 మెగాపిక్సల్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
- 32 జీబీల వరకు మెమొరీని పెంచుకునే వెసులుబాటు