: భార్య మీద కోపంతో.. కూతురిని దారుణంగా చంపేసిన వ్యక్తి!
భార్య తనను వదిలిపెట్టి వేరే వ్యక్తిని పెళ్లాడిందన్న కోపంతో ఓ వ్యక్తి తన సొంత కూతురిని దారుణంగా చంపేసిన ఘటన బీహార్‌లోని కతిహార్ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికంగా నివసించే మహ్మద్ ముస్తాక్ (40) దంపతులకు ఎమినిదేళ్ల కూతురు ఉంది. ఇటీవలే అతడిని వదిలేసి భార్య వెళ్లిపోయింది. ముస్తాక్ కూతురు సుహానీ మాత్రం అతడితోనే ఉంటోంది. తన భార్య ఢిల్లీలో వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని తెలుసుకున్న ముస్తాక్... ఆ కోపాన్ని అభం శుభం తెలియని తన కూతురిపై చూపించాడు. తన కూతురిని చావబాదిన ముస్తాక్ ఇంకా కోపం తగ్గకపోవడంతో ఆమె పీక పిసికి చంపేశాడు. ముస్తాక్ భార్య దుఖ్నీ ఖాతూన్ (35) తన భర్తను వదిలిపెట్టి ఐదు నెలలు అవుతోందని పోలీసులు తెలిపారు. ముస్తాక్ అత్తింట్లోనే ఉంటాడని, అతను పనేమీ చేయకుండా ఖాళీగా వుంటుండడంతో అతడితో ఖాతూన్ గొడవపెట్టుకునేదని చెప్పారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.