: హోంమంత్రి వున్నది చంపడానికా?: వీహెచ్


వామపక్షాలపై తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు ఘాటుగా స్పందించారు. ‘వామపక్షాలు రెచ్చిపోతే చచ్చిపోతారని హోం మంత్రి అంటున్నారని, చంపడానికి ఉన్నారా హోంమంత్రి?’ అని ఆయన ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యం గురించి అడుగుతున్న గవర్నర్.. ధర్నాచౌక్, రైతు సమస్యల గురించి పట్టించుకోరా? అని వీహెచ్ ప్రశ్నించారు. కాగా, హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద నిన్న జరిగిన సంఘటనపై నాయిని ఈ రోజు మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కమ్యూనిస్టులు రెచ్చిపోవద్దని, రెచ్చిపోతే ప్రజల చేతుల్లో చచ్చిపోతారని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News